వసంత పంచమి వేడుకలు ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగరాజ్ లో ఘనంగా జరుగుతున్నాయి. సీఎం యోగీ ఆదిత్యనాథ్ త్రివేణి సంగమం దగ్గర స్నానం చేసి, గంగా హారతి ఇచ్చారు. ఆ తర్వాత నదిలో బోటు షికారు చేశారు. గంగాహారతి కార్యక్రమంలో యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ పాల్గొన్నారు.