దేశం యొక్క ఆర్ధికవ్యవస్థ బాగానే ఉందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అక్టోబర్ 2 న విడుదలయిన 3 సినిమాలు వార్, జోకర్, సైరా నరసింహ రెడ్డి ఒక్కరోజు లోనే రూ .120 కోట్లకు పైగా సంపాదించాయని వివరించారు. ఇది 3 సినిమాల రికార్డు. దేశం యొక్క ఆర్ధికవ్యవస్థ అద్భుతంగా ఉంది అని చెప్పడానికి సినిమా కలెక్షన్స్ సాక్ష్యం అని అన్నారు .