హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఏపీ రాజధాని రగడపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్07:44 AM January 03, 2020

ఏపీ రాజధానిపై దుమారం కొనసాగుతోంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు కాబోతోందన్న వార్తల నేపథ్యంలో అమరావతి రైతులు రోడ్డెక్కారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదంటూ.. 13 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ రాజధానిపై అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులను ఎలా నిర్ణయిస్తారు? విధివిధానాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తాను స్పందిస్తానని తెలిపారు. రాజధానిపై వేసిన కమిటీల నివేదికలు బయటకు వచ్చాక దీనిపై బీజేపీ స్పందిస్తుందని.. ఆ తర్వాతే కేంద్ర హోంశాఖ అభిప్రాయం చెబుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading