రాష్ట్రంలో టీఆర్టీ నియామకాలను తక్షణమే చేపట్టాలని, వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలని, తమకు పోస్టింగ్ అలాట్ చేయాలని టీఆర్టీ అభ్యర్థులు సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్‌ను ముట్టడించారు. వీరికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.