తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఈనేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు సీఎన్ఎన్ న్యూస్18 ప్రతినిధి రిషికా సాదంతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు, సీఏఏ, ఎంఐఎంతో దోస్తీ, కాబోయే సీఎం అనే ప్రచారంపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.