హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : టీఆర్ఎస్‌ వినూత్న ప్రచారం.. రెండు ఎకరాల్లో కారు ముగ్గు

తెలంగాణ15:19 PM January 15, 2020

తెలుగు ప్రజలు సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో పట్టణాల్లో మరింత సందడి పెరిగింది. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్లలో సుమారు 200 మంది మహిళలు 2 ఎకరాల్లో కారు గుర్తు ముగ్గు వేశారు. సంక్రాంతి పురస్కరించుకొని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ కారు గుర్తు ముగ్గును వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం మూడు గంటల్లోనే ఈ ముగ్గును సిద్ధం చేసి అబ్బుర పరిచారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారీ కారు గుర్తు ముగ్గు వేయడం స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కారు గుర్తు ముగ్గును వీక్షించడానికి పట్టణవాసులు తండోపతండాలుగా వచ్చి వీక్షించారు. ఈ ముగ్గును వేసి మహిళా కార్యకర్తలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వారిని స్థానిక టిఆర్ఎస్ నేతలు ప్రజా ప్రతినిధులు అభినందించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading