కరీంనగర్ కార్పొరేషన్‌కు మేయర్‌గా సునీల్ రావును టీఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపారాణిని ఎంపిక చేశారు. 33వ డివిజన్ నుంచి యాదగిరి సునీల్‌రావు పోటీ చేసి భారీ మెజా రిటీతో విజయం సాధించారు. ఆయన కరీంనగర్ కార్పొరేషన్ నుంచి కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా నాలుగుసార్లు విజయం సాధించారు. మధ్యాహ్నం 11 గంటలకు ఇద్దరు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం 13 మంది బీజేపీ కార్పొరేటర్లు బయటికి వెళ్లిపోయారు.