చేవెళ్లలో తనపై పోటీకి దించడానికి ముగ్గురి పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, ఓ పౌల్ట్రీ ఫామ్ నిర్వహించే పారిశ్రామికవేత్త పేరును టీఆర్ఎస్ పరిశీలిస్తోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. మహేందర్ రెడ్డి ఓడిపోతారన్న ఉద్దేశంతోనే ఆయనను పక్కన పెట్టారని చెప్పారు.