హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన..

తెలంగాణ15:03 PM December 11, 2019

తెలంగాణకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. కేంద్రం నుండి 29,891 నిధులు తెలంగాణకు రావలసి ఉందని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలంటూ పార్లమెంట్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టిఆర్ఎస్ ఎంపీల నిరసన చేపట్టారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సార్లు ప్రధానికి, కేంద్రమంత్రులను లేఖలు కూడా రాశారని నామా అన్నారు. ఇందుకోసం ఆరు సంవత్సరాల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేశామని తెలిపారు. కొత్త రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని భావించామని... కానీ ఎలాంటి సహకారం అందడం లేదని నామా ఆరోపించారు. తక్షణమే తెలంగాణ కు రావల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading