ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వారం రోజులు రాబడి రాకుంటే కోతలు విధిస్తారా? ప్రశ్నించారు ఉత్తమ్. ప్రైవేట్ ఉద్యోగులకు పూర్తి వేతనాలను ఇవ్వాలని చెప్పిన కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎందుకు కోతలు విధించారని మండిపడ్డారు. రూ.10వేల కోట్ల రాబడి వస్తున్నా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పించారు.