ఏపీలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్దలైపోయినా అనంతపురం జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ విజయం సాధించిన విషయం తెలిసిందే. 20 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. దీనికి గానూ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను చేసిన అభివృద్ధిని చూసి గతంలో కంటే మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించారు.