హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ప్రధాని నరేంద్ర మోదీ విజయోత్సహాం... అమిత్ షాతో కలిసి అభివాదం...

జాతీయం22:44 PM May 23, 2019

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాతో కలిసి ఉత్సాహంగా సమావేశానికి హాజరయ్యారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రెండు సీట్ల నుంచి రెండోసారి అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారన్నారు. ఈ ప్రయాణంలో బీజేపీ కార్యకర్తలు తమ సంస్కారం, వినమ్రత, ఆదర్శాలను ఎక్కడా వదిలిపెట్టలేదని చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో ఎవరైనా గెలిచారంటే అది హిందుస్థాన్. ఈ విజయం ప్రజాస్వామ్య విజయం. ఇది ప్రజల విజయం. ఈ గెలుపుని ప్రజలకు అంకితం ఇస్తున్నాం. ఎన్నికల్లో గెలుపొందిన ప్రతి నేతకు అభినందనలు. వారు ఏ ప్రాంతం, ఏ పార్టీ వారు అయినా కావొచ్చు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం అందరం సమష్టిగా సేవ చేద్దాం.’ అని నరేంద్ర మోదీ అన్నారు.

Chinthakindhi.Ramu