హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఆశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన వృద్ధ దంపతులు... స్వయంగా కలిసిన కేటీఆర్...

తెలంగాణ09:21 PM IST Jan 10, 2019

యాద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మ దంపతులు ఎంతో శ్రమకోర్చి ఓ వృద్ధాశ్రమాన్ని నిర్మించారు. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ వృద్ధాశ్రమాన్ని తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా అందించాలని నిర్ణయించారు ఆ దంపతులు. దాదాపు ఎకరంన్నర భూమిలో దాదాపు ఆరు వేల చదరపు అడుగులు భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మించామని తెలిపిన ఈ దంపతులు... అనారోగ్యం కారణంగా నడపలేకపోతున్నారని కేటీఆర్‌కు తెలిపారు. పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి దంపతులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌తో మాట్లాడి వృద్ధాశ్రమం నిరంతర సేవలు కొనసాగించేలా చూస్తానని హామీ ఇచ్చారు కేటీఆర్.

Chinthakindhi.Ramu