భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు నిర్వహించారు. ప్రభుత్వం తరపున మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ సీతారాముల స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగానే శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా జరిపించామని తెలిపారు.