మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన మంచి మనసును చాటుకున్నారు. మహబూబ్ నగర్ లోని చిన్నదర్పల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా కలెక్టర్ బంగ్లా బ్రిడ్జి వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయలపాలయిన యాదయ్య అనే వ్యక్తికి ఆయన సాయం అందించారు. తీవ్రంగా గాయపడిన యాదయ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో మాట్లాడి వైద్యం అందించాలని కోరారు.