లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఆదిలాబాద్లో టీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న సిట్టింగ్ నగేష్ గెలుపు కోసం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న గ్రామాల్లో తిరుగుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు భజనతో వినూత్నంగా ప్రచారంచేశారు. ఎమ్మెల్యే జోగురామన్న భజన బృందంలో సభ్యుడిలా మెదిలి తాళం వేస్తూ ప్రచారం కొనసాగించారు.