రెండు నెలల క్రితం విమర్శలు గుప్పించిన నామా నాగేశ్వరరావును పిలిచి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడంపై ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి మండిపడ్డారు. సిట్టింగ్ ఎంపీ పొంగులేటిని కాదని నామాకు టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటని ప్రశ్నించారు.