ఆర్టీసీ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా సమ్మె చేస్తున్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా న్యూస్ 18 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఏ కారణం లేకుండా ఏకపక్ష చర్య తీసుకునే హక్కు కెసిఆర్‌కు లేదని, ఆర్టీసీ కార్మికులపై కెసిఆర్ నిర్ణయం అప్రజాస్వామికం అని అన్నారు.