టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ బాధితుడు కలిశాడు. నిన్న మాచర్లకు చెందిన దండు పెద వెంకయ్యపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తన కుమారుడి కోసం వచ్చి తనపై దాడి చేశారని వెంకయ్య వాపోయాడు. చంద్రబాబు వద్ద బాధితుడు పెద వెంకయ్య భోరున విలపించాడు. రక్తంతో తడిసిన చొక్కాతో వెంకయ్య రావడంతో.. అతడిని చూసి చంద్రబాబు చలించిపోయారు.