వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును ఆశామాషీగా తీసుకోబోమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. అందుకు వైఎస్ఆర్సీపీ ఒప్పుకున్నా.. తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. వైఎస్ వివేక హత్యకేసుకు సంబంధించి నిజానిజాలు బయటకు రావాల్సిందేనన్నారు. దోషులను కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు.