తుళ్లూరు మండలం అనంతవరంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై తెలుగుదేశం నాయకులు దౌర్జన్యానికి దిగారు. కులం పేరుతో దళిత ఎమ్మెల్యేను సభ్య పదజాలంతో టీడీపీ నాయకులు దూషించారు. నువ్వు వినాయకుడి చవితి ఉత్సవాల్లో పాల్గొంటే వినాయకుడు మైలు పడతాడంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు.