అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో జరిగిన ర్యాలీలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తెనాలిలో రైతుల శిబిరం వద్ద చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.