ఏపీ మాజీ మంత్రి డొక్యా మాణిక్య వరప్రసాద్ వైసీపీ పార్టీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో డొక్కాకు వైసీపీ కండువా కప్పిన జగన్.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.