అమరావతి రాజధాని కోసం రాయపూడిలో జరుగుతున్న నిరసన దీక్షలకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. రాయపూడి రైతులు, మహిళలు భారీస్థాయిలో పాల్గొన్నారు. రాజధాని తరలిస్తే సహించేది లేదని ప్రాణాలైన అర్పిస్తామంటూ రాజధాని వాసులు నినదించినారు. అమరావతి సాధించుకు తీరుతామని అప్పటి వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేసారు.