ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్‌ది పైశాచిక ఆనందమేనని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన.. జోలె పట్టి రాజధాని ఉద్యమానికి విరాళాలు సేకరించారు. బాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు, రాష్ట్రం కోసం తాను జోలె పడుతున్నానని, రైతులకు సంఘీభావంగా సంక్రాంతి పండుగను కూడా జరుపుకోవడం లేదని అన్నారు. అమరావతి కేవలం 29 గ్రామాల సమస్య కాదని, రాష్ట్ర ప్రజలందరిదీ అని ఆయన వ్యాఖ్యానించారు.