సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై టీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన.. కేటీఆరే కబ్జాకోరు అని విరుచుకుపడ్డారు. దుర్గం చెరువు వద్ద అక్రమ నిర్మాణాలను చేపట్టారని.. తెలంగాణ అమరవీరుల సమాధులపై పునాదులు నిర్మిస్తున్నారని విమర్శలు గుప్పించారు.