ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ని నియమించింది. అప్పుడే ఆయన బాధ్యతలు కూడా స్వీకరించేశారు. ఒకప్పుడు ఆయన మద్రాస్ హైకోర్టులో జడ్జిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా కూడా పనిచేశారు. పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించిన ప్రభుత్వం తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం SECగా వి.కనగరాజ్ నియామకం జరిగింది.