తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్వామివారిని దర్శించుకున్నారు. రాజధాని సాధనకు 50 రోజులపాటు చేస్తున్న ఉద్యమం.. 100 రోజులైనా ఇదే రీతిలో కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు మాజీ మంత్రి పరిటాల సునీత స్వామివారిని దర్శించుకున్నారు. తన రెండో కుమారుడు సిద్ధార్థతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన సిద్ధార్థ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో మొదటి శుభలేఖను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందినట్లు సునీత తెలిపారు.