HOME » VIDEOS » Politics » RAJINIKANTH GIVES CLARITY ON HIS POLITICAL ENTRY HERE ARE THE DETAILS AVR

Video: సీఎం పదవిపై వ్యామోహం లేదు.. అధ్యక్షుడిగా ఉంటా..: రజినీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఈ రోజు కోసం గత కొన్ని నెలలుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈరోజు రజినీకాంత్ తన పార్టీ గురించి, తాను పార్టీని ఎలా నడుపనున్నాడో వివరణ ఇచ్చారు. ఆయన చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనకు సీఎం అవ్వాలనే ఆసక్తి లేదని... కానీ పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రం ఉంటానని పేర్కోన్నాడు. పార్టీ సీఎం అభ్యర్థిగా భాగా చదువుకున్న వ్యక్తిని నియమిస్తామని ఈ సందర్భంగా తెలిపాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అస్థిరత ఏర్పడిందని.. ఈ లోటును పూర్చడానికి యువరక్తం రాజకీయాలలోకి రావాలన్నారు. ప్రభుత్వం, పార్టీలపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదంటూ.. నిజాయితీపరులకే సీఎం పీఠం దక్కాలని పేర్కోన్నాడు. తన పార్టీలో 65 శాతం యువకులకి త‌ప్ప‌క‌ అవ‌కాశం ఉంటుందని.. రిటైర్డ్‌ ఐఏస్‌, ఐపీఎస్‌లని పార్టీలలోకి ఆహ్వానిస్తానని ప్రెస్ మీట్‌లో రజనీకాంత్ పేర్కోన్నాడు. దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇలాంటి నిస్వార్థమైన ప్రకటన చేసినందుకు తమిళనాడులో ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

webtech_news18

Top Stories