హిందీని ఉమ్మడి భాషగా చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదనను తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ తప్పుపట్టారు. ఒకే భాష ఉండడం మంచిదే అయినా, భారత్లో అది సాధ్యం కాదన్నారు. ఏ భాష అయినా బలవంతంగా రుద్దడం సరికాదని స్పష్టం చేశారు. హిందీని తప్పనిసరి చేయడం దక్షిణాదితోపాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాలు కూడా అంగీకరించబోవని రజినీకాంత్ అభిప్రాయపడ్డారు.