టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు, నందమూరి వారసుడు బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన నియోజకవర్గంలోనే ఆయనకు అవమానం జరిగింది. అనంతపురం జిల్లా హిందూపురంలో ఇవాళ పర్యటనకు శ్రీకారం చుట్టారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్ వస్తుండగా... అక్కడ స్థానికులు అడ్డుకున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకించినందున బాలయ్యను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన వారిలో స్థానికులు, వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. రాయలసీమ ద్రోహి గో బ్యాక్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బాలయ్య గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.