టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను మియాపూర్ కోర్టు కొట్టివేసింది. కేటీఆర్ ఫాంహౌస్ మీద డ్రోన్ ఎగరేశారనే ఆరోపణలతో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీస్ ల మోహరించారు. ఇంట్లోకి ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తాము అన్న కుదరదు అని అంటున్నారు.