అమరావతి గ్రామాల్లో నాలుగు వారాలుగా అన్నదాతలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వారిని అడ్డుకునేంందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. రాజధాని గ్రామాల్లో పలుచోట్ల డ్రోన్ కెమెరాల్ని సైతం వినియోగిస్తున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని మైకు ద్వారా సూచించారు. మందడంలో అయితే ఏకంగా పోలీసులు కవాతు నిర్వహించారు.