గుంటూరు జిల్లా బంద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై ర్యాలీగా వెళ్తున్న టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంతంగా బంద్ కొనసాగుతా ఉంటే పోలీసులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారని రోడ్డుపైనే టీడీపీ నేతలు బైఠాయించారు. దీంతో నేతల్ని అరెస్ట్ చేసి నల్లపాడు పొలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ఈ విషయంలో టీడీపీ,పోలీసుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది.