సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. సాయంత్రం భారీ రోడ్ షో అనంతరం దశాశ్వమేథ ఘాట్‌లో గంగా హారతి నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య పాల్గొన్నారు.