ఉగ్రవాదం మానవత్వానికి పెను ముప్పుగా మారిందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించని ప్రధాని మోదీ.. తన ప్రసంగంలో ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. టెర్రరిజం యావత్ మనవాళికి ప్రమాదకరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం పోరాడేందుకు అందరం కలిసి పనిచేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 125 ఏళ్ల క్రితం చికాగోలో స్వామి వివేకానంద శాంతి, సామరస్యం గురించి ప్రసంగించారని.. భారత్ ఇప్పటికీ అదే సందేశాన్ని ఇస్తోందన్నారు ప్రధాని మోదీ.