ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలివడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు బలమైన, సుస్థిరమైన పాలన, అవినీతి రహిత పాలనను అందించడమే మా లక్ష్యం. కుల రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సి ఉంది. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను వైసీపీ ప్రభుత్వం నీరుగార్చుతోంది. ఏపీ రక్షణ, అభివృద్ధి కోసమే రెండు పార్టీలు కలుస్తున్నాయి. 2024లో జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది.