కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను స్వాగతిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జాతిని ఉద్దేశించి మోదీ గారు చేసిన సూచనలను జన సైనికులే కాక తెలుగు వారందరూ పాటించాలని పవన్ కళ్యాన్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22 వ తేదీ ఆదివారం రోజు మోదీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూ గా పాటిద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.