ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కొంతకాలంగా జైల్లో ఉన్న చిదంబరం ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు కుమారుడు కార్తీ చిదంబరం, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక గురువారం ఉదయం 11 గంటలకు చిదంబరం పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కార్తీ చిదంబరం వెల్లడించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం తీహర్ జైలులో 106 రోజులు ఉన్నారు.