ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ తెలిపారు. రివ్యూలు, సమావేశాలు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకు వస్తాయని చెప్పారు. ఐతే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.