కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాధి నివారణ కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మేల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. కరోన వ్యాధి నివారణ కొరకు తమ సొంత కుటుంబాలకు దూరంగా ఉంటూ నిరంతరం శ్రమిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలకి చేరవేసే మీడియా మిత్రుల కృషి వెలకట్టలేనిదన్నారు. కరోనా వ్యాధికి మందు లేనందున నగర ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని, వ్యక్తిగత శుభ్రత మరియు సామాజిక దూరం పాటిస్తూ అత్యవసరం ఉంటేనే మాస్క్ లు ధరించి బయటకి రావాలని తెలిపారు.