నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఆస్తులు, అప్పుల వివరాలను నారా లోకేష్ ప్రకటించారు. నారా లోకేష్ చెప్పిన దాని ప్రకారం.. చంద్రబాబు కుటుంబం మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు. అలాగే, మొత్తం అప్పులు కలిపి రూ.26.04 కోట్లుగా ప్రకటించారు. మొత్తంగా చూస్తే ఆస్తుల్లో నుంచి అప్పులు మినహాయించగా, వారి నికర ఆస్తుల విలువ రూ.93.38 కోట్లుగా తెలిపారు. దీనికి నిర్వాణ హోల్డింగ్స్ సంస్థ ఆస్తులు అదనం.