హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : రాజధాని రైతుల ఉద్యమానికి భువనేశ్వరి మద్దతు.. బంగారు గాజు విరాళం

ఆంధ్రప్రదేశ్19:34 PM January 01, 2020

రాజధాని గ్రామాల్లో చంద్రబాబుతో కలిసి పర్యటించారు ఆయన సతీమణి  నారా భువనేశ్వరి. ఈ సందర్భంగా ఆమె అమరావతిలో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతు పలికారు. అమరావతి ఉద్యమానికి తన వంతు విరాళం అందించారు. తన చేతి కి ఉన్న బంగారు గాజును తీసి అక్కడున్న రైతులకు ఇచ్చారు నారా భువనేశ్వరి. భువనేశ్వరి గాజును బహిరంగ వేలం వేసి, ఆ డబ్బును ఉద్యమానికి వినియోగించాలని రైతులకు తెలిపారు చంద్రబాబు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... చంద్రబాబు అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు కూడా మిమ్మల్నితలుచుకుంటున్నారు. ఆయనకు మీ తర్వాతే మేము. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఎంతగానే తపించారన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా ఉంచామన్నారు. ప్రజల తర్వాత తనను, కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకునేవారన్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాల్లో భువనేశ్వరి పర్యటన కొనసాగింది. ఇవాల్టికి అమరావతి రైతుల పోరాటం 15వ రోజుకు చేరింది. తుళ్లూరులో మహాధర్నాను నిర్వహించాలని రైతులు నిర్ణయించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading