హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఖమ్మలో అభివృద్ధి పనుల పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్

తెలంగాణ21:56 PM April 14, 2020

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన అనేక అభివృద్ధి పనులు GHMC తరహాలోనే పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో మంజూరైన పనులకు కరోనా వైరస్ నేపథ్యంలో కూలీల కొరతతో పనులు ఆగిపోయాయి. అయితే వేసవిలొనే పనులు పూర్తి చేయకపోతే వచ్చే వర్షాకాలంలో పనులు చేయడం సాధ్యపడదని భావించిన మంత్రి పువ్వాడ అధికారులతో మాట్లాడారు. ఈ మేరకు కార్పొరేషన్ పరిధిలో బిటి పనులు తక్షణమే ప్రారంభించాలని కార్పొరేషన్, ఆర్&బి అధికారులను ఆదేశించారు. బోస్ బొమ్మ సెంటర్, చర్చ్ కాంపౌండ్ సెంటర్, దంసలాపురం ఆర్ఓబి బ్రిడ్జి అనుసంధానం బిటి రోడ్, ముస్తఫా నగర్ సెంటర్ లో ప్రారంభమైన పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading