మాజీ సీఎం చంద్రబాబును బిచ్చగాడితో పోల్చారు మంత్రి కొడాలి నాని. అసెంబ్లీలో టీడీపీ సభ్యులతో అల్లరి చేయించి వారి మీద చర్యలు తీసుకుంటే.. బయటకు వెళ్లి అడుక్కోవాలని చంద్రబాబుకు ఆరాటంగా ఉందని మండిపడ్డారు. అందుకే మొన్న అసెంబ్లీ ముందు నల్ల గుడ్డ వేసుకుని కూర్చున్నారని విమర్శించారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ఎదుట ఆందోళన చేయకుండా మార్షల్స్‌తో అడ్డుకోవాలని కొడాలి నాని సూచించారు.