NMC Bill: నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) బిల్లు అమలైతే పేద విద్యార్థులకు శాపంగా మారుతుందని, దాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో మెడికల్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. కేంద్రం మొండి వైఖరి వీడకుంటే అత్యవసర వైద్య సేవలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ బిల్లు వల్ల ప్రైవేట్ యాజమాన్యాల్లో 50 శాతం సీట్లు డబ్బిచ్చి కొనుక్కున్న వారికి దక్కుతాయని తెలిపారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.