అమరావతిలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అరెస్ట్ అయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ రాజధాని గ్రామాలైన పెనుమాకలో ర్యాలీ చేపట్టారు ఆర్కే. 144 సెక్షన్ అమలులో ఉందంటూ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అరెస్టును అడ్డుకున్నారు వైసీపీ నేతలు. పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్కెతో పాటు పలువురు వైసీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.