మహారాష్ట్ర కాబోయే సీఎం గడ్కరీ అని వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. మహారాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రకు తిరిగి వచ్చే ప్రసక్తే లేదని, ఢిల్లీ నుంచే పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు గడ్కరీ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం వస్తుందన్నారు. ఫడ్నవీస్ నేతృత్వంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.