హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా..

జాతీయం14:09 PM March 20, 2020

మధ్యప్రదేశ్‌లో సస్పెన్స్‌కు తెరపడింది. మరికొద్దిసేపట్లో అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొవాల్సిన సీఎం కమల్ నాథ్... అంతకు కొన్ని గంటల ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సమావేశంలో బీజేపీపై విమర్శలు గుప్పించిన కమల్ నాథ్... వ్యాపారంతో కూడిన రాజకీయాల్లో తాను ఎప్పుడు భాగస్వామిని కాలేనని ఆయన వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరూ తనను వేలెత్తి చూపలేరని కమల్ నాథ్ అన్నారు. తనకు ప్రజల ఇచ్చిన సర్టిఫికెట్ ఉందని... ఇతరులు ఇచ్చే సర్టిఫికెట్ అవసరం లేదని తెలిపారు. బీజేపీ రాష్ట్రాన్ని కానీ, తన ఆత్మస్థైర్యాన్ని కానీ దెబ్బతీయలేదని అన్నారు. తాను తన రాజకీయ జీవితంలో విలువలతో కూడిన రాజకీయాలే చేశానని అన్నారు. గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖ ఇవ్వబోతున్నట్టు తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading