వయనాడ్ (కేరళ)లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వయనాడ్‌తో పాటు అమేథీ (యూపీ)లోనూ పోటీచేస్తున్న విషయం తెలిసిందే.